హైదరాబాద్, 31 July
మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించడంతో పాటు, తనకు తెలియకుండా వీడియోలు తీశారని ఆరోపిస్తూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 26వ తేదీన యువతి పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదును నమోదు చేసినట్లు సమాచారం.
మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించడంతో పాటు, తనకు తెలియకుండా వీడియోలు తీశారని ఆరోపిస్తూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈనెల 26వ తేదీన యువతి పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదును నమోదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.








