అన్నారం, గుండ్ల సింగారం ప్రాంతాలలో గోదావరి నదిని అక్రమంగా తవ్వేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు నిర్మిస్తున్నారని, ఈ వ్యవహారంలో అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లక్షల జీతాలు తీసుకునే అధికారులు లంచాలకు అలవాటుపడి, నదీ గర్భంలో జరుగుతున్న అక్రమాలను పట్టించుకోవడం లేదని వార్తలు వస్తున్నాయి.
సహజంగా ప్రవహించే గోదావరి నదిని మళ్లించి, నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా రోడ్లను నిర్మిస్తున్నా, అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లక్షల రూపాయల జీతాలు తీసుకునే కొంతమంది అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ, గోదావరిని నదీ గర్భంలో రోడ్లు వేసినా, రాత్రింబవళ్లు భారీ యంత్రాలతో లెక్కలేని ఇసుక తోడుతున్నా పట్టించుకోవడం లేదని విశ్వసనీయ సమాచారం.
కాసులకు అలవాటు పడిన అక్రమాధికారులు గోదావరిలో నీళ్లు, ఇసుక కలిపి అమ్ముకొమ్మని, అంతేకాకుండా ఎలా అమ్మోకోవాలో, అక్రమానికి కూడా రశీదులు ఏ విధంగా తెచ్చుకోవాలో కూడా సూచిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
టిజిఎండిసి సిబ్బంది గురించి ఎంత చెప్పినా తక్కువేనని, ఇసుక ర్యాంపుల్లో లారీ వచ్చి లోడు చేసుకుని పోయేంతవరకు అన్నీ పర్సంటేజీలేనని, ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నం, సాయంత్రం బిర్యానీల వరకు వివిధ రూపాల్లో ముట్టచెప్పాల్సిందేనని తెలుస్తోంది.








