భద్రాద్రి కొత్తగూడెం, 18 July
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని రామానుజవరం గ్రామానికి చెందిన కట్ట చిరంజీవి అనారోగ్యంతో భద్రాచలం సూర్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, నైనిష ఫౌండేషన్ స్పందించి రూ.3,000 ఆర్థిక సహాయం అందించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గం, మణుగూరు మండలంలోని రామానుజవరం గ్రామం అయోధ్య నగర్ కాలనీకి చెందిన కట్ట చిరంజీవి అనారోగ్యంతో భద్రాచలం సూర్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి చాలా దీనస్థితిలో ఉంది. కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది. కట్ట చిరంజీవి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం...
ఈ కుటుంబం దయనీయ పరిస్థితిని తెలుసుకున్న నైనిష ఫౌండేషన్ సభ్యులు వెంటనే స్పందించి, కట్ట చిరంజీవికి రూ.3,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా నైనిష ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు తమ సంస్థ అండగా నిలుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫౌండర్ మట్టపల్లి సాగర్ యాదవ్, పోదిల వీరబాబు, అడ్వకేట్ ఈర్ల రాము, మిట్టపల్లి గోపి, సాధిని సీతయ్య, బాణాల కృష్ణ, బానోతు రమేష్, కంపేర్ల నాగేశ్వరరావు, కట్ట మహేష్ తదితరులు పాల్గొన్నారు.








