NCR, 31 అక్టోబర్ 2026
ఢిల్లీ- ప్రాంతంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ () కీలక నిర్ణయం తీసుకుంది. నుంచి 20 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు హాజరుకావాలని, మిగిలిన వారు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
శీతాకాలంలో ఢిల్లీ- ప్రాంతంలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో, ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదేశాలు ఢిల్లీతో పాటు గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా) వంటి ఐదు జిల్లాలకు వర్తిస్తాయి.
ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం వరకు ఉద్యోగులు మాత్రమే ప్రత్యక్షంగా విధులకు హాజరుకావాలి. మిగిలిన వారు ఇంటి నుంచే పనిచేయాలి. అయితే, ఈ విధానం అమలు చేయడం సాధ్యం కాని పారిశ్రామిక సంస్థలు, అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుంది.
నిర్మాణ పనులపై ఆంక్షలు
వాయు కాలుష్యానికి కారణమయ్యే దుమ్ము, ధూళిని తగ్గించేందుకు ప్రాంతమంతటా నిర్మాణ, కూల్చివేత పనులపై కూడా ఆంక్షలు విధించారు. భవనాల కూల్చివేత, బహిరంగ నిర్మాణ కార్యకలాపాలు, రహదారుల నిర్మాణం, ఫ్లైఓవర్లు, ఓవర్బ్రిడ్జిల నిర్మాణం, విద్యుత్ ప్రసార లైన్ల పనులు, పైప్లైన్, టెలికమ్యూనికేషన్ పనులపై ఈ నిషేధం వర్తిస్తుంది.
వాయు కాలుష్యం: 50 శాతం ఉద్యోగులకే ఆఫీసులకు అనుమతి
అయితే, ప్రజలకు అత్యవసరమైన మౌలిక సదుపాయాల పనులకు మినహాయింపులు ఇచ్చారు. రైల్వే ప్రాజెక్టులు, మెట్రో రైలు సేవలు, విమానాశ్రయాల పనులు, అంతర్రాష్ట్ర బస్ టెర్మినళ్లు, ఆసుపత్రుల నిర్మాణం, నీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు, జాతీయ భద్రత, రక్షణ రంగానికి సంబంధించిన పనులు, జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు లభించింది.
కాలుష్యం పెరగడానికి కారణాలు
2018 నుంచి 2025 వరకు నవంబర్ నెలలో నమోదైన గాలి నాణ్యత సూచీ () గణాంకాలను పరిశీలించింది. నవంబర్ మొదటి, రెండో వారాల్లో ఢిల్లీ- ప్రాంతంలో కాలుష్యం అధికంగా నమోదవుతున్నట్లు గుర్తించింది. దీనికి ప్రధాన కారణాలు: వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం, పంట వ్యర్థాలను తగులబెట్టడం, బయోమాస్ దహనం, గాలుల వేగం తగ్గిపోవడం, వాతావరణంలో కాలుష్య కారకాలు నేల దగ్గరే పేరుకుపోవడం.
గతంలో కొన్ని రోజుల పాటు స్థాయులు , కేటగిరీలకు చేరుకున్నాయని కమిషన్ పేర్కొంది. వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందుగానే కాలుష్య ఉద్గారాలను తగ్గించడమే ఈ ఆదేశాల ప్రధాన ఉద్దేశమని తెలిపింది. ఈ ఆదేశాలను 2021లో రూపొందించిన చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం జారీ చేశారు.
ఢిల్లీ-లో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి, నవంబర్ 1 నుంచి 20 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50 మంది ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు హాజరుకావాలని, మిగిలిన వారు ఇంటి నుంచే పని చేయాలని వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ () ఆదేశించింది. దుమ్ము సృష్టించే నిర్మాణ పనులపై కూడా ఆంక్షలు విధించారు.











