అమెరికాలోని మిషిగన్ రాష్ట్ర ప్రతినిధుల సభ స్పీకర్‌గా భారతీయ అమెరికన్ రంజీవ్ పురి ఎన్నికయ్యారు. 42 ఏళ్ల రంజీవ్ పురి ఈ పదవికి ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు. డెమొక్రటిక్ పార్టీ సభ్యులు ఆయనను 20272028 శాసనసభ కాలానికి స్పీకర్‌గా ఎన్నుకున్నారు.
పంజాబ్‌కు చెందిన వలస తల్లిదండ్రులకు జన్మించిన రంజీవ్ పురి 2020లో మిషిగన్ ప్రతినిధుల సభకు తొలిసారి ఎన్నికయ్యారు. అదే ఏడాది మిషిగన్ చట్టసభకు ఎన్నికైన తొలి సిక్కు అమెరికన్‌గా గుర్తింపు పొందారు. 2025లో డెమొక్రటిక్ పార్టీ శాసనసభా పక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. చికాగో విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేసిన ఆయన గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎన్నికల ప్రచారాల్లో పనిచేశారు. అనంతరం ఆటోమొబైల్ రంగంలోనూ పనిచేశారు. 2025లో కొత్త శాసనసభ కొలువుదీరినప్పుడు ఆయన స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ఎన్నికతో ఆయన అమెరికా రాజకీయాల్లో భారతీయ సంతతికి చెందిన వారికి కొత్త అధ్యాయాన్ని లిఖించారు.

