మానుగూరు, 2026-11-21
కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మణుగూరు మండలం అశోక్‌నగర్ గ్రామానికి చెందిన జోగా సంతోష్ కుటుంబానికి ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన కింద రూ.2 లక్షల బీమా పరిహారం మంజూరైంది. ఖమ్మం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు () మణుగూరు శాఖ అధికారులు ఈ మేరకు బీమా చెక్కును అందజేశారు.
కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన అండగా నిలిచింది. ఈ పథకం ద్వారా రూ.2 లక్షల భరోసా లభించింది. మణుగూరు మండలం అశోక్‌నగర్ గ్రామానికి చెందిన జోగా సంతోష్ కుటుంబానికి ఈ పథకం కింద రూ.2 లక్షల బీమా పరిహారం మంజూరైంది. ఖమ్మం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు () మణుగూరు శాఖ అధికారులు, బాధిత కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ బాలరాజు మాట్లాడుతూ, తక్కువ వార్షిక ప్రీమియంతో జీవిత బీమా రక్షణ కల్పించే ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజనను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో ఈ పథకం ద్వారా అందే పరిహారం, బాధిత కుటుంబానికి ఆర్థికంగా ఎంతో తోడ్పడుతుందని ఆయన తెలిపారు. బ్యాంకుల ద్వారా అందుబాటులో ఉన్న సామాజిక భద్రతా పథకాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ రేష్మ, క్యాషియర్ తిలక్ తేజ, బీఈ సంతోష్, సిఎఫ్ఎల్ మౌనిక, పీఏసీఎస్ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.


