హైదరాబాద్, 7 October
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (ఆర్జీఐఏ) డీఆర్ఐ అధికారులు భారీ మొత్తంలో విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 2.25 కోట్ల విలువైన 1,481.780 గ్రాముల బంగారాన్ని ఒక ప్రయాణికుడి వద్ద నుంచి సీజ్ చేశారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (ఆర్జీఐఏ) డీఆర్ఐ అధికారులు 1,481.780 గ్రాముల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 2.25 కోట్లు.
తిరుచిరాపల్లి నుంచి హైదరాబాద్ వచ్చిన ఒక ప్రయాణికుడిని తనిఖీ చేయగా, ఆరు బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. బ్లూ టేప్‌తో చుట్టి, కార్బన్ పేపర్లో ప్యాక్ చేసి, దుస్తుల కింద ప్రత్యేకంగా రూపొందించిన పౌచ్‌లో బంగారాన్ని దాచినట్లు అధికారులు గుర్తించారు.
నిర్దిష్ట సమాచారం మేరకు డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. విదేశీ ప్రయాణంలో విమానంలోనే బంగారాన్ని దాచి, హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత దేశీయ ప్రయాణంలో దాన్ని బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
విమానంలో దాచిన బంగారాన్ని తానే తీసుకున్నట్లు ప్రయాణికుడు విచారణలో అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. కస్టమ్స్ యాక్ట్, 1962 ప్రకారం బంగారాన్ని సీజ్ చేసి, సదరు ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు.












