హైదరాబాద్, 2026-11-21
తెలంగాణ ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాల కోసం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా అందనుంది. రేషన్ కార్డు లేనివారు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే, ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఏకంగా రూ.5 లక్షల జీవిత బీమా అందనుంది.
ముఖ్యంగా రేషన్ కార్డు లేని వారు కూడా ఈ పథకానికి అప్లయ్ చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కొత్త ఇందిరమ్మ బీమా పథకం అమల్లోకి వచ్చింది. సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు.
లబ్ధిదారులు బీమా కోసం ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. కుటుంబంలో ఒకరి కన్నా ఎక్కువ మంది సంపాదిస్తున్నా.. వారిలో ఎవరికి బీమా చేయించుకోవాలనేది కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చు.
అర్హులు ఎవరు
18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. రేషన్ కార్డు ఉన్నవారితో పాటు, అది లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, నామినీ వివరాలు రిజిస్టర్ చేయడం తప్పనిసరి. ఒకరి కన్నా ఎక్కువ మంది నామినీలను చేర్చాలనుకుంటే, వారికి ఎంత వాటా ఇవ్వాలనేది కూడా తెలియజేయాలి.
ఇలా అప్లై చేసుకోండి
వరకు గ్రామ పంచాయతీలు, వార్డు కార్యాలయాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. ఆధార్ కార్డుతో పాటు అందుబాటులో ఉన్న కుటుంబ వివరాలను తీసుకెళ్లి అప్లయ్ చేసుకోవచ్చు. రేషన్ కార్డు లేని వారికి ప్రత్యేక ఫారం అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, అధికారులు ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరించనున్నారు.


