కేంద్ర ఎన్నికల సంఘం ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ () చేపట్టనున్నట్లు ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలతో పాటు చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ ప్రాంతాల్లో ఈ ప్రక్రియ నిర్వహించనుంది.
తుది ఓటర్ల జాబితాను జనవరి 21న ప్రకటించనున్నారు. జనవరి 1, 2024, జనవరి 1, 2025 తేదీల నాటికి 18 ఏళ్లు నిండే యువత కూడా ముందస్తుగా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, అర్హత పొందిన త్రైమాసికంలోనే వారి దరఖాస్తులను పరిశీలిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతున్నందున అక్కడి షెడ్యూల్ను తర్వాత ప్రకటించనున్నారు.












