మానుగూరు, 2026-11-21
మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రమాదకరమైన సమస్య అని, వాటికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని మణుగూరు ప్రథమ శ్రేణి న్యాయ మేజిస్ట్రేట్ కంబంపాటి సూరి రెడ్డి అన్నారు. మణుగూరులోని గుట్టమల్లారం విజ్ఞాన ప్రైవేట్ స్కూల్లో మాదకద్రవ్యాలపై, బాలబాలికల రక్షణ చర్యల చట్టాలపై విద్యార్థులకు లీగల్ సెల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రమాదకరమైన సమస్య అని, వాటికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని మణుగూరు ప్రథమ శ్రేణి న్యాయ మేజిస్ట్రేట్ కంబంపాటి సూరి రెడ్డి అన్నారు. మణుగూరులోని గుట్టమల్లారం విజ్ఞాన ప్రైవేట్ స్కూల్లో మాదకద్రవ్యాలపై, బాలబాలికల రక్షణ చర్యల చట్టాలపై విద్యార్థులకు లీగల్ సెల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా లీగల్ సెల్ చైర్మన్, మణుగూరు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కంబపు సూరిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మేజిస్ట్రేట్ సూరిరెడ్డి మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తి ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా కుటుంబ వ్యవస్థ, సామాజిక జీవనం కూడా ప్రభావితమవుతాయని తెలిపారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షిస్తూ సరైన మార్గదర్శకత్వం అందించాలని సూచించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగానికి సంబంధించి ఎన్డీపీఎస్ () చట్టంలో కఠినమైన నిబంధనలు ఉన్నాయని వివరించారు. బాలలపై జరిగే లైంగిక నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం పోక్సో () చట్టం-2012ను అమలులోకి తీసుకువచ్చిందని ఆయన వివరించారు. 18 సంవత్సరాల లోపు బాలబాలికలకు లైంగిక వేధింపులు, దాడులు, దోపిడీ నుంచి చట్టపరమైన రక్షణ కల్పించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పిల్లల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, లైంగిక వేధింపులకు పాల్పడినా అటువంటి చర్యలు తీవ్రమైన నేరాలుగా పరిగణించబడతాయని పేర్కొన్నారు. బాలలపై జరిగే నేరాల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు తమకు ఎదురయ్యే సమస్యలను నిర్భయంగా చెప్పుకునే వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు భయపడకుండా పోలీసులకు సమాచారం అందించాలని, బాధిత బాలల గోప్యతను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. బాల్య వివాహాల వల్ల బాలబాలికల విద్య, ఆరోగ్యం, మానసిక వికాసం, భవిష్యత్తు తీవ్రంగా ప్రభావితమవుతాయని న్యాయమూర్తి తెలిపారు. బాల్య వివాహాల నిషేధ చట్టం-2006 ప్రకారం 18 సంవత్సరాలు నిండని బాలికకు, 21 సంవత్సరాలు నిండని బాలుడికి వివాహం చేయడం చట్ట విరుద్ధమని వివరించారు. బాల్య వివాహాలను నిర్వహించే, ప్రోత్సహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతి బాలబాలికకు విద్యను అందించి, వారి ఆశయాలను ప్రోత్సహిస్తూ ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంపై ఉందన్నారు. అదేవిధంగా ప్రతి బాలుడికి విద్య, ఆరోగ్యం, రక్షణ, గౌరవంగా జీవించే హక్కులు ఉన్నాయని ఆయన వివరించారు. బాల కార్మికత్వం, బాలలపై హింస, నిర్లక్ష్యం, అక్రమ రవాణా, వేధింపుల నుంచి పిల్లలను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.
జువెనైల్ జస్టిస్ చట్టం ద్వారా సంరక్షణ అవసరమైన బాలలకు రక్షణ, పునరావాసం కల్పించేందుకు చట్టపరమైన వ్యవస్థ ఉందని, విద్యా హక్కు చట్టం ద్వారా పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య పొందే అవకాశం కల్పించబడిందని వివరించారు. చట్టాలపై అవగాహన ప్రతి పౌరుడికి అవసరమని, నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే నేరాలు జరగకుండా ముందస్తు అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. ముఖ్యంగా బాలల హక్కులను గౌరవిస్తూ, వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించినప్పుడే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల రహిత సమాజం, బాలలపై లైంగిక నేరాలు లేని సమాజం, బాల్య వివాహాలు లేని సమాజం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని న్యాయమూర్తి కంబంపాటి సూరి రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సి హెచ్ గురు కృష్ణ, లీగల్ ఎయిడ్ కౌన్సిలర్ పద్మావతి, న్యాయవాదులు కందిమల్ల నరసింహారావు, సిహె.చ్ రవికుమార్, కె వీర మధుసూదన్, ఏ సర్వేశ్వరరావు, పోశం భాస్కర్ సరస్వతి, జి నిరంజన్ రెడ్డి రెడ్డి, ఎం.ఎల్.ఎస్సి సిబ్బంది కె రవీందర్, ఎం వాసవి, స్కూల్ కరస్పాండెంట్ సాంబ రెడ్డి, ప్రిన్సిపాల్ విజయ కుమార్ లు పాల్గొన్నారు.







