మానుగూరు, 14 September
2026 లో మణుగూరులో నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే ఛాంపియన్షిప్ విజేతలకు అభినందనలు. ప్రతిభావంతులు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ పతకాలు సాధించినట్లు చాటారు. కాశీ మల్ల పద్మ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ప్రతిభను ప్రదర్శించారు. భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ పోటీల్లో విజేతలు రాణించాలని ఆకాంక్షించారు.
మణుగూరు హైదరాబాద్ లో నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే ఛాంపియన్షిప్–2026లో మణుగూరుకు చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. వివిధ విభాగాల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ పతకాలు సాధించి మణుగూరు ఖ్యాతిని చాటారు.కరాటే మాస్టర్ కాశీ మల్ల పద్మ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో ప్రతిభను ప్రదర్శించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులను కరాటే మాస్టర్, తల్లిదండ్రులు, స్థానికులు అభినందించారు. చిన్న వయసులోనే కరాటేలో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు.






