మానుగూరు, 2026-11-23
మణుగూరులో యునైటెడ్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికైంది, జర్నలిస్టుల ఐక్యత, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారాన్ని లక్ష్యంగా ఈ క్లబ్ ఏర్పాటు చేయబడింది.
మణుగూరులో యునైటెడ్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. జర్నలిస్టుల ఐక్యత, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారాన్ని లక్ష్యంగా మణుగూరులో యునైటెడ్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొని, వివిధ బాధ్యతలను సభ్యులకు అప్పగించారు.
నూతన కార్యవర్గ వివరాలు
గౌరవ అధ్యక్షులు: చిర్రా శ్రీనివాస్ గౌడ్. అధ్యక్షులు: మాచర్ల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి: పొనగంటి కృష్ణ కోశాధికారి: ఎస్.కె. స్టాలిన్ ఉపాధ్యక్షులు: నక్క శ్రీనివాస్, మరాసు సుధీర్, చింతల లెనిన్ సహాయ కార్యదర్శులు: పొదిల్ల సుబ్బారావు, సనప భరత్, దొనికెనా ప్రేమ్ కుమార్ ప్రచార కార్యదర్శులు: వి. బాబీ, బానోత్ మధు, పొడుతూరి ప్రసాద్ క్రీడా విభాగం: ఎడెల్లి భవానీ శంకర్ సాంస్కృతిక విభాగం: ఉల్లి రామారావు న్యాయ సహాయకులు: డేగల కృష్ణ ప్రసాద్
ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమం, ఐక్యత, వృత్తిపరమైన గౌరవం కోసం సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, హక్కుల పరిరక్షణకు యునైటెడ్ ప్రెస్ క్లబ్ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.


