మానుగూరు, 2026-11-21
విద్యార్థులకు పుస్తకాల్లోని పాఠాలను కేవలం తరగతి గదులకే పరిమితం చేయకుండా, నిజజీవిత అనుభవాల ద్వారా సులభంగా అర్థమయ్యేలా బోధించేందుకు మణుగూరులోని రాధిక ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల చిన్నారులను పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్న పండ్ల దుకాణాల వద్దకు తీసుకెళ్లి, అక్కడ వివిధ రకాల పండ్లను చూపించారు. పుస్తకాల్లో చిత్రాల రూపంలో చూసిన వివిధ రకాల పండ్లను ప్రత్యక్షంగా చూపిస్తూ, వాటి పేర్లు, రంగులు, ఆకారాలు, ప్రత్యేకతలను సరళమైన భాషలో వివరించారు.
తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవడంతో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా, ఆనందంగా నేర్చుకున్నారు. పుస్తక జ్ఞానానికి ప్రాక్టికల్ అనుభవాన్ని జోడించడం ద్వారా చిన్నారుల్లో విషయ పరిజ్ఞానం పెంపొందించవచ్చని ఉపాధ్యాయులు ఈ సందర్భంగా నిరూపించారు.
అభినందనలు
విద్యార్థులకు చదువుతో పాటు నిత్యజీవితంలో ఉపయోగపడే జ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా ఇలాంటి వినూత్న విద్యా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు.
విద్య అంటే పుస్తకాల్లో చదవడమే కాదు, జీవితంలో చూసి, అనుభవించి నేర్చుకోవడం కూడా







