స్పోర్టింగ్ క్లబ్ ఢిల్లీకి చెందిన మిడ్‌ఫీల్డర్ లాల్రిన్లియానా హ్నమ్టే భారత సీనియర్ పురుషుల ఫుట్‌బాల్ జట్టులో చోటు దక్కించుకున్నారు. న్యూజిలాండ్‌తో ఈ నెల 15, 17 తేదీల్లో జరగనున్న రెండు అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌ల కోసం కోచ్ ఖలీద్ జమిల్ ప్రకటించిన 23 మంది సభ్యుల జట్టులో ఆయన ఎంపికయ్యారు.
స్పోర్టింగ్ క్లబ్ ఢిల్లీకి చెందిన మిడ్‌ఫీల్డర్ లాల్రిన్లియానా హ్నమ్టే భారత సీనియర్ పురుషుల ఫుట్‌బాల్ జట్టులో చోటు దక్కించుకున్నారు. న్యూజిలాండ్‌తో ఈ నెల 15, 17 తేదీల్లో జరగనున్న రెండు అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌ల కోసం కోచ్ ఖలీద్ జమిల్ ప్రకటించిన 23 మంది సభ్యుల జట్టులో ఆయన ఎంపికయ్యారు. తొలి మ్యాచ్ ఆక్లాండ్‌లో, రెండో మ్యాచ్ క్రైస్ట్‌చర్చ్‌లో జరగనుంది. గతంలో అండర్-23 స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హ్నమ్టేకు సీనియర్ జట్టులో ఇది మరో కీలక అవకాశం.

