ప్రముఖ బరువు తగ్గించే, మధుమేహ చికిత్స మందులైన వెగోవీ (), జెప్బౌండ్ (), ఓజెంపిక్ (), మౌంజారో () వినియోగంపై ఈ హెచ్చరికను జారీ చేసింది.
ప్రముఖ బరువు తగ్గించే, మధుమేహ చికిత్స మందులైన వెగోవీ (), జెప్బౌండ్ (), ఓజెంపిక్ (), మౌంజారో () వినియోగంపై ఈ హెచ్చరికను జారీ చేసింది. ఈ మందులు వాడేవారిలో నాన్ ఆర్టెరిటిక్ యాంటీరియర్ ఇస్కీమిక్ ఆప్టిక్ న్యూరోపతి () అనే అరుదైన కంటి సమస్య వచ్చే ప్రమాదం ఉందని సంస్థ వెల్లడించింది. ఈ సమస్య కంటి నరానికి రక్తప్రసరణను తగ్గించి, అకస్మాత్తుగా, నొప్పి లేకుండా చూపు తగ్గడానికి లేదా శాశ్వతంగా చూపు కోల్పోవడానికి దారితీయవచ్చని తెలిపింది. -1 తరగతికి చెందిన అన్ని మందుల లేబుళ్లపై ఈ ప్రమాదానికి సంబంధించిన హెచ్చరికలను తప్పనిసరిగా జోడించాలని ఆదేశించింది. ఈ మేరకు 1.34 లక్షల మందికి పైగా పాల్గొన్న 126 క్లినికల్ అధ్యయనాల విశ్లేషణను సంస్థ చేపట్టింది. ఈ అధ్యయనంలో, ఈ మందులు వాడిన వారిలో ప్రతి లక్ష వ్యక్తి-సంవత్సరాలకు 6.4 కేసులు నమోదవగా, ఇతర చికిత్సలు లేదా ప్లేసిబో తీసుకున్న వారిలో 3.8 కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపింది. చూపు మసకబారడం, కంటికి కనిపించే దృశ్యంలో ఖాళీలు ఏర్పడటం, రంగులు సరిగ్గా కనిపించకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని రోగులకు సూచించింది. అయితే, ఈ మందులు వాడటం వల్లే ఈ సమస్య వస్తుందని ఇంకా నిర్ధారణ కాలేదని కూడా సంస్థ స్పష్టం చేసింది. వైద్యుల సలహా లేకుండా ఈ మందులను నిలిపివేయకూడదని సూచిస్తున్నారు.

