కేరళలో మార్కెట్లకు వస్తున్న కూరగాయల్లో ప్రమాదకరమైన పురుగుమందుల అవశేషాలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన 1,258 కూరగాయల నమూనాలను పరీక్షించగా, 62 నమూనాల్లో అనుమతించిన పరిమితికి మించి విషపూరిత రసాయనాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది.
కేరళలో మార్కెట్లకు వస్తున్న కూరగాయల్లో ప్రమాదకరమైన పురుగుమందుల అవశేషాలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన 1,258 కూరగాయల నమూనాలను ప్రభుత్వ ప్రయోగశాలల్లో పరీక్షించగా, 62 నమూనాల్లో అనుమతించిన పరిమితికి మించి విషపూరిత రసాయనాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. కేరళలో వినియోగించే కూరగాయల్లో సుమారు 90 శాతం ఇతర రాష్ట్రాల నుంచే దిగుమతి అవుతున్నందున, వాటిపై పూర్తిస్థాయి నిషేధం విధించడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది. కూరగాయల కొరత, ధరల పెరుగుదలను నివారిస్తూ, రాష్ట్రంలోనే సురక్షితమైన కూరగాయల ఉత్పత్తిని పెంచేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇళ్ల మేడలు, పెరటితో పాటు పాఠశాలలు, ఐటీ సంస్థల్లోనూ విషరహిత కూరగాయల సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

