నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ () అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ () ప్రిలిమ్స్ 2026 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా మొత్తం 321 జనరలిస్ట్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్‌తో పాటు పాస్వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రిలిమినరీ పరీక్ష ఆన్లైన్ విధానంలో నిర్వహించబడుతుంది. పరీక్షకు హాజరయ్యేటప్పుడు అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఈ గుర్తింపు కార్డు లేకుండా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరి మెయిన్స్ పరీక్ష నిర్వహించబడుతుంది. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు, పరీక్ష విధానం, సిలబస్ వంటి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించగలరు.

