పంజాబ్ ప్రభుత్వం రూ.100.65 కోట్ల వ్యయంతో రెండు కాలువల సాగునీటి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా, రూ.64.11 కోట్లతో ఫతేగఢ్ సాహిబ్, జిల్లాల్లోని సుమారు 80 గ్రామాలకు ప్రయోజనం చేకూర్చే 1-ఆర్ డిస్ట్రిబ్యూటరీ కాలువను పునర్నిర్మించనున్నారు.
మరో రూ.36.54 కోట్లతో చేపట్టనున్న కపూరి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా జిల్లాలోని 20 గ్రామాలకు చెందిన 20,719 ఎకరాల భూమికి సాగునీరు అందనుంది. ఈ రెండు ప్రాజెక్టులతో కలిపి 90 వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమికి కాలువ నీరు అందనుంది.
ఈ ప్రాజెక్టుల అమలుతో భూగర్భ జలాలపై రైతుల ఆధారపడటం తగ్గుతుందని అధికారులు తెలిపారు. కాలువ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు నీటి వృథాను అరికట్టేందుకు కాంక్రీట్ లైనింగ్ పనులు చేపట్టనున్నారు.

