అమెరికాకు చెందిన టైమెక్స్ సంస్థ మార్లిన్ కాలిఫోర్నియా డయల్ లిమిటెడ్ ఎడిషన్ వాచ్‌ను విడుదల చేసింది. దీని ధర సుమారు రూ.28,085 (299 అమెరికన్ డాలర్లు). ప్రపంచవ్యాప్తంగా కేవలం 200 వాచీలను మాత్రమే ఈ సంస్థ తయారు చేస్తోంది.
ఈ వాచ్‌లో బ్లాక్ డయల్‌పై రోమన్, అరబిక్ అంకెల కలయికతో ప్రత్యేకమైన కాలిఫోర్నియా డిజైన్‌ను అందించారు. 34 ఎంఎం స్టెయిన్లెస్ స్టీల్ కేస్, చేతితో తిప్పి నడిపే మెకానికల్ మూవ్మెంట్, 30 మీటర్ల వాటర్ రెసిస్టెన్స్, బ్రౌన్ లెదర్ స్ట్రాప్ దీని ప్రత్యేకతలుగా ఉన్నాయి. మిగిలిన 100 వాచీలను టైమెక్స్ అమెరికా వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చని సంస్థ తెలిపింది.

