జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం కన్వీనర్ సీపీ.రమేష్ రాష్ట్ర విజిలెన్స్ కమిటీ ప్రత్యేక ఆహ్వాన సభ్యులుగా ఎంపికయ్యారు. ఆహార భద్రత పథకం అమలు, వినియోగదారుల సమస్యలపై ప్రభుత్వానికి సలహాలు అందించేందుకు ఈ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
రాష్ట్ర విజిలెన్స్ కమిటీ ప్రత్యేక ఆహ్వాన సభ్యులుగా జిల్లా నుంచి జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం కన్వీనర్ సీపీ.రమేష్ ఎంపికయ్యారు.
రాష్ట్రంలో ఆహార భద్రత పథకం సమర్థవంతంగా అమలు, వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
తన నియామకానికి సహకరించిన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఎస్ఓలకు, రాష్ట్ర విజిలెన్స్ కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి, కమిటీ ఏర్పాటుకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సీపీ.రమేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ, గ్యాస్, పెట్రోల్, నిత్యావసర సరుకుల పంపిణీలో జరిగే అవకతవకలపై నిఘా ఉంచుతానని, పంపిణీ సక్రమంగా జరిగేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఎక్కడైనా అక్రమాలు జరిగితే జిల్లా అధికారుల దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.







