మానుగూరు, 22 July
ఏఐసిసి నాయకులు, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టు అప్రజాస్వామికమని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గురిజాల గోపి విమర్శించారు. వరుస లీకు ప్రశ్నా పత్రాలతో విద్యార్థుల జీవితాలతో బిజేపి ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో, ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేపట్టిన రాహుల్ గాంధీ, విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం బాష్పవాయువు ప్రయోగించి, లాఠీచార్జి చేయడం హేయమైన చర్య అని ఆయన అన్నారు.
ఏఐసిసి నాయకులు, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గురిజాల గోపి స్పష్టం చేశారు. వరుస లీకు ప్రశ్నా పత్రాలతో విద్యార్థుల జీవితాలతో బిజేపి ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆయన ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసనగా.. ఢిల్లీలో రాహుల్ గాంధీ, విద్యార్థులు శాంతియుతంగా చేపట్టిన నిరసనపై కేంద్ర ప్రభుత్వం బాష్పవాయువును ప్రయోగించి, వారిపై లాఠీచార్జి చేయడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలో బుధవారం మణుగూరు అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గురిజాల గోపి ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు పూనం సరోజ, సీనియర్ మహిళా నాయకురాలు ఎండి షబానా ఆధ్వర్యంలో సుమారు 100 మంది మహిళా నాయకులు, కార్యకర్తలతో కలిసి నోటికి నల్ల రిబ్బన్లు ధరించి మౌన నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా నాయకులు బొడ్డు సౌజన్య, కోరి శ్యామల, కన్నాపురం వసంత, డేరంగుల సుజాత, రెడ్డిబోయిన రేణుక, కన్నాపురం శైలజ, బాడిష పార్వతి, లక్కింశెట్టి హేమలత తదితరులు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు పెద్ద ఎత్తున హాజరై నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.










