సారపాక (రాజకీయ ప్రభంజనం) జూలై 01
బూర్గంపాడు మండలం సారపాకలోని మసీద్ రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడి రహదారి పూర్తిగా అద్వానంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డంతా నీటితో నిండిన గుంతలుగా మారడంతో వాహనదారులు, పాదచారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు ఈ రహదారిపై ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బూర్గంపాడు మండలం సారపాకలోని మసీద్ రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడి రహదారి పూర్తిగా అద్వానంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డంతా నీటితో నిండిన గుంతలుగా మారడంతో వాహనదారులు, పాదచారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు ఈ రహదారిపై ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతల్లో వర్షపు నీరు నిల్వ ఉండటంతో వాటి లోతు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అనేకసార్లు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి శాశ్వత చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని, అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సారపాక మసీద్ రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

