భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి సాగునీటిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్ తెలిపారు. అదేవిధంగా 400 కోట్ల రూపాయలతో మారేళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించి, నిధులను మంజూరు చేసిన ఘనత కూడా బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు.
అయితే, స్థానిక మండల రైతాంగానికి నీళ్లు అందించకుండా పక్క జిల్లాకు తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టు ద్వారా విడుదలవుతున్న జలాలను మారెళ్ళపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మండల రైతాంగానికి అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై చర్చించేందుకు రేపు (తేదీ 15.7.2026) ఉదయం 10 గంటలకు KVR ఫంక్షన్ హాల్ నందు అఖిలపక్ష పార్టీ నాయకులు, మిత్రపక్ష పార్టీలు, స్థానిక రైతులు పాల్గొనే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఒకవేళ మండల రైతాంగానికి నీళ్లు ఇవ్వకుండా పక్క జిల్లాలకు తరలించే పద్ధతి కొనసాగితే, రాబోయే రోజుల్లో సీతారామ పంప్ హౌస్ ముట్టడి, రోడ్డు రాస్తారోకో, నిరసన కార్యక్రమాలను అఖిలపక్షం, రైతుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని కోడి అమరేందర్ యాదవ్ హెచ్చరించారు.






