మానుగూరు, 28 October
మణుగూరు సింగరేణి ఏరియాలో పనిచేస్తున్న 170 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు బుధవారం యూనిఫారాలు, ఇతర సామగ్రిని పంపిణీ చేశారు. ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓ టు జీఎం డి. వెంకట రామారావు పాల్గొన్నారు.
మణుగూరు: సింగరేణి మణుగూరు ఏరియాలో విధులు నిర్వహిస్తున్న 170 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు బుధవారం యూనిఫారాలు, విధి నిర్వహణకు అవసరమైన ఇతర సామగ్రిని పంపిణీ చేశారు. మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓ టు జీఎం డి. వెంకట రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణి గనులు, కార్యాలయాలు, పారిశ్రామిక ప్రాంగణాలు, సంస్థకు చెందిన ఆస్తుల పరిరక్షణలో సెక్యూరిటీ గార్డుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. సెక్యూరిటీ గార్డులకు ఒక్కొక్కరికి ఒక జత ఖాకీ యూనిఫారం, డీఎంఎస్ షూస్, సాక్సులు, క్యాప్, లాఠీ, లాన్యార్డ్, విజిల్, గుర్తింపు కార్డులు, స్టేషనరీ పుస్తకాలను అందజేశారు. ఈ సామగ్రిని మణుగూరు ఏరియా ప్రైవేట్ సెక్యూరిటీ కాంట్రాక్టర్ ఎంఎస్ శ్రీ సాయిరాం సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా సమకూర్చినట్లు తెలిపారు. అదేవిధంగా, సెక్యూరిటీ సిబ్బందికి ఆసుపత్రిలో వైద్య చికిత్స సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించారు. యూనిఫారం క్రమశిక్షణ, బాధ్యత, విధి పట్ల నిబద్ధతకు ప్రతీక అని పేర్కొంటూ, సమయపాలన పాటించి పరిశుభ్రమైన యూనిఫారంతో విధులకు హాజరుకావాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలు గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. సంస్థ ఆస్తులు, యంత్రాలు, పరికరాల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం (పర్సనల్) ఎస్. రమేష్, ఏరియా ఇంజినీర్ వి. మదన్ నాయక్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ జి. నాగేశ్వరరావు, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ కె. శ్రీనివాస్, ఏరియా జూనియర్ ఇన్స్పెక్టర్ బి. విజయేందర్, కాంట్రాక్టర్ మురారి గౌడ్, సెక్యూరిటీ సూపర్వైజర్లు రామ అవతార్, డి. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.












