అశ్వాపురం, 21 July
అశ్వాపురం మండలంలోని మొండికుంట గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో కురిసిన వర్షాలకు వరద నీరు నేరుగా మండల రామకృష్ణ ఇంట్లోకి చేరింది. ఈ పరిస్థితితో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అశ్వాపురం మండలంలోని మొండికుంట గ్రామంలో కురిసిన భారీ వర్షాలకు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వరద నీరు నేరుగా మండల రామకృష్ణ ఇంట్లోకి చేరింది. ఇంటి ఆవరణతో పాటు గదుల్లోకి కూడా నీరు చేరడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇంటి ముందు, చుట్టుపక్కల నీరు నిలిచిపోవడంతో రాకపోకలు కష్టంగా మారాయి. మురుగు నీరు నిల్వ ఉండటంతో దుర్వాసన, దోమల బెడద పెరిగి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు నీటిలోనే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది.
డ్రైనేజీ సౌకర్యం లేక ప్రతి వర్షానికి ఇదే పరిస్థితి ఎదురవుతోందని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. గ్రామ పంచాయతీ, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిల్వ నీటిని తొలగించి, శాశ్వతంగా డ్రైనేజీ నిర్మించి సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.











