ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో భాగమైన ఇంటర్నెట్ ప్రస్థానం ఒక చిన్న సందేశంతో ప్రారంభమైంది. సమాచారాన్ని క్షణాల్లో చేరవేయడం నుంచి ఆన్లైన్ విద్య, డిజిటల్ చెల్లింపులు, వ్యాపార లావాదేవీలు, వీడియో కాల్స్ వరకు ఎన్నో సేవలకు ఆధారంగా నిలుస్తున్న అంతర్జాలం వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఈ చరిత్రలో కీలక ఘట్టమైన తొలి కంప్యూటర్ సందేశాన్ని గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం న అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో భాగమైన ఇంటర్నెట్ ప్రస్థానం ఒక చిన్న సందేశంతో ప్రారంభమైంది. సమాచారాన్ని క్షణాల్లో చేరవేయడం నుంచి ఆన్లైన్ విద్య, డిజిటల్ చెల్లింపులు, వ్యాపార లావాదేవీలు, వీడియో కాల్స్ వరకు ఎన్నో సేవలకు ఆధారంగా నిలుస్తున్న అంతర్జాలం వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఈ చరిత్రలో కీలక ఘట్టమైన తొలి కంప్యూటర్ సందేశాన్ని గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం న అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
యూసీఎల్ఏ పరిశోధకుడు చార్లీ క్లైన్ కంప్యూటర్లో లాగిన్ () అనే పదాన్ని టైప్ చేసి పంపాలని భావించారు. అయితే వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎల్, ఓ అక్షరాలు మాత్రమే అవతలి కంప్యూటర్కు చేరాయి. దీంతో నెట్వర్క్ ద్వారా పంపిన తొలి సందేశంగా లో () చరిత్రలో నిలిచింది. కొద్దిసేపటి తర్వాత పూర్తి పదాన్ని పంపగలిగారు. చిన్న సందేశంగా కనిపించిన ఈ ప్రయోగం భవిష్యత్తులో ప్రపంచవ్యాప్త సమాచార విప్లవానికి మార్గం సుగమం చేసింది.
ఇంటర్నెట్ నుంచి వరల్డ్ వైడ్ వెబ్ వరకు
ప్రారంభంలో పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ విభాగాల మధ్య సమాచార మార్పిడికి ఉపయోగపడిన కంప్యూటర్ నెట్వర్క్లు క్రమంగా విస్తరించాయి. వివిధ నెట్వర్క్లు పరస్పరం అనుసంధానమయ్యే సాంకేతిక ప్రమాణాలు అభివృద్ధి చెందడంతో ఇంటర్నెట్ మరింత విస్తృతమైంది.
1989లో టిమ్ బెర్నర్స్-లీ వరల్డ్ వైడ్ వెబ్ ( ) ఆలోచనను అభివృద్ధి చేశారు. వెబ్సైట్లు, వెబ్ పేజీల ద్వారా సమాచారాన్ని సులభంగా పొందే అవకాశం ఏర్పడింది. ఇంటర్నెట్, వరల్డ్ వైడ్ వెబ్ ( ) ఒకటే కాదు. ఇంటర్నెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా అనుసంధానమైన కంప్యూటర్ నెట్వర్క్ల వ్యవస్థ కాగా, వెబ్ అనేది దాని ద్వారా సమాచారాన్ని పొందేందుకు ఉపయోగించే సేవల్లో ఒకటి.
నిత్యజీవితంలో అంతర్జాలం కీలక పాత్ర
ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం దాదాపు అన్ని రంగాలకూ విస్తరించింది. విద్యార్థులు ఆన్లైన్ తరగతులు, డిజిటల్ గ్రంథాలయాల ద్వారా సమాచారాన్ని పొందుతున్నారు. వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులను అంతర్జాలం ద్వారా విక్రయిస్తున్నాయి. బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు, ప్రభుత్వ సేవలు, వైద్య సంప్రదింపులు కూడా ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి.
విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్ ద్వారా మాట్లాడటం, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను వెంటనే తెలుసుకోవడం, ఇంటి నుంచే పనిచేయడం వంటి సౌకర్యాలు ఇంటర్నెట్ వల్ల సాధ్యమయ్యాయి. సమాచారం వేగంగా అందుబాటులోకి రావడంతో పాటు ప్రపంచంలోని వ్యక్తులు, సంస్థల మధ్య సంబంధాలు మరింత సులభమయ్యాయి.
ప్రయోజనాలతో పాటు సవాళ్లూ..
ఇంటర్నెట్ అందిస్తున్న ప్రయోజనాలతో పాటు సైబర్ నేరాలు, వ్యక్తిగత సమాచార దుర్వినియోగం, నకిలీ వార్తలు, ఆన్లైన్ మోసాలు వంటి సమస్యలూ పెరుగుతున్నాయి. గుర్తుతెలియని లింకులను తెరవడం, ధృవీకరించని సమాచారాన్ని ఇతరులకు పంపడం, వ్యక్తిగత వివరాలు లేదా బ్యాంకింగ్ సంకేతాలను అపరిచితులతో పంచుకోవడం ప్రమాదకరం.












