ఆంధ్రప్రదేశ్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇప్పటికే అర్నబ్ తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రజలు, రైతులు మరో వర్ష సూచనతో ఆందోళన చెందుతున్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం
దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
జిల్లాల వారీగా వర్ష సూచన
శనివారం: మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం: కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం: తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మత్స్యకారులకు హెచ్చరిక
బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదని హెచ్చరించారు.
ఇప్పటికే అర్నబ్ తుపాను కారణంగా జిల్లాల్లో పంటలు, ఇళ్లు, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో తాజా వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.