మణుగూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో, అశ్వాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని సీతారామ కెనాల్ వద్ద 27.10.2026 తేదీన ఉదయం వాహనాల తనిఖీ చేస్తుండగా, ద్విచక్ర వాహనంపై ఎండు గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు మణుగూరు ఎక్సైజ్ సీఐ కె.నాగేశ్వరరావు తెలిపారు.
అధికారుల వివరాలు
నిందితుల వద్ద నుండి 4.1 కిలోల గంజాయి, ఒక హీరో స్ప్లెండర్ ద్విచక్ర వాహనం, మరియు 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దాడులలో విజయ్ భాస్కర్, ట్రైనీ వేణు, సిబ్బంది నాగరాజు, లు శ్రీనివాస్, వెంకట్, రామకృష్ణ, నరేష్, వీరబాబు, రమేష్ పాల్గొన్నారు.












