28 ఏళ్ల మమతా కఫ్లే వర్జీనియాలో నర్సుగా పనిచేసేవారు. 2020 చివరిలో ఆమె కనిపించకుండా పోయారు. భర్త నరేశ్ తొలుత ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియదని పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 2020లో నరేశ్‌ను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆమె మృతదేహం మాత్రం లభించలేదు.
కోర్టులో భర్త సంచలన అంగీకారం
విచారణ చివరి దశలో నరేశ్ స్వయంగా సాక్ష్యం చెబుతూ సంచలన విషయాలు వెల్లడించాడు. తన భార్య ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించిందని, ఆమె అప్పటికే చనిపోయిందని భావించానని చెప్పాడు. ఆమె ఆత్మహత్య చేసుకుందని, భయంతో మృతదేహాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించానని వాదించాడు. అందుకోసం రంపంతో మృతదేహాన్ని ముక్కలుగా చేసి చెత్త సంచుల్లో ఉంచినట్లు అంగీకరించాడు. అయితే ఆమెను తాను హత్య చేయలేదని మాత్రం వాదించాడు. ఈ వాదనను ప్రాసిక్యూషన్ తీవ్రంగా వ్యతిరేకించింది.
ఫోరెన్సిక్ ఆధారాలతో నిందితుడికి ఎదురుదెబ్బ
దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న పవర్ సా, ఇంట్లోని కార్పెట్, సీసీటీవీ దృశ్యాలు, ఫోన్ రికార్డులు వంటి ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. పవర్ సాపై లభించిన నమూనాలు మమతా డీఎన్ఏతో సరిపోలినట్లు ఫోరెన్సిక్ నిపుణులు సాక్ష్యమిచ్చారు. చెత్త సంచులు, శుభ్రపరిచే వస్తువులు కొనుగోలు చేసిన దృశ్యాలను కూడా ప్రాసిక్యూషన్ చూపించింది.
శిక్ష వివరాలు
ఆరు వారాలకు పైగా సాగిన విచారణ అనంతరం జ్యూరీ నరేశ్‌ను దోషిగా నిర్ధారించింది. ఫస్ట్ డిగ్రీ హత్యకు వర్జీనియా చట్టాల ప్రకారం కనీసం 20 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం ఉంది. మృతదేహాన్ని దాచిపెట్టడం, అవమానించడం వంటి ఇతర నేరాలకు అదనపు శిక్షలు కూడా విధించవచ్చు. తుది శిక్షను న ఖరారు చేయనున్నారు.
మమతా మృతదేహం ఇప్పటికీ లభించలేదు. అయినప్పటికీ అందుబాటులో ఉన్న ఫోరెన్సిక్, డిజిటల్ ఆధారాల ఆధారంగా జ్యూరీ ఈ తీర్పు ఇవ్వడం ఈ కేసులో అత్యంత కీలక పరిణామంగా నిలిచింది.
అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో నేపాల్ మూలాలున్న నర్సు మమతా కఫ్లే భట్ హత్య కేసులో ఆమె భర్త నరేశ్ భట్‌ను ఫస్ట్ డిగ్రీ హత్య కేసులో దోషిగా నిర్ధారించింది. మృతదేహాన్ని దాచిపెట్టడం, అవమానించడం వంటి ఇతర అభియోగాల్లోనూ అతడిని దోషిగా తేల్చింది. తుది శిక్షను డిసెంబర్ 12న ఖరారు చేయనున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు
మమతా కఫ్లే భట్ హత్య కేసులో ఎవరు దోషిగా తేలారు?
మమతా కఫ్లే భట్ హత్య కేసులో ఆమె భర్త నరేశ్ భట్ దోషిగా తేలాడు.
నరేశ్ భట్‌పై ఏ అభియోగాలు మోపబడ్డాయి?
నరేశ్ భట్‌పై ఫస్ట్ డిగ్రీ హత్య, మృతదేహాన్ని దాచిపెట్టడం, అవమానించడం వంటి అభియోగాలు మోపబడ్డాయి.





