సింగపూర్ ఎయిర్‌లైన్స్ కీలక వాటాదారుగా ఉన్న ఎయిర్ ఇండియా పునర్వ్యవస్థీకరణలో గణనీయమైన పురోగతి సాధిస్తోందని తెలిపింది. అయితే, సంస్థను పూర్తిస్థాయిలో లాభాల బాట పట్టించేందుకు మరికొంత సమయం పడుతుందని పేర్కొంది. విమాన ప్రయాణికులకు అందించే సేవల నాణ్యత, నిర్వహణ సామర్థ్యం మెరుగుపడుతున్నాయని వెల్లడించింది.
సింగపూర్ ఎయిర్‌లైన్స్ కీలక వాటాదారుగా ఉన్న ఎయిర్ ఇండియా పునర్వ్యవస్థీకరణలో గణనీయమైన పురోగతి సాధిస్తోందని తెలిపింది. అయితే, సంస్థను పూర్తిస్థాయిలో లాభాల బాట పట్టించేందుకు మరికొంత సమయం పడుతుందని పేర్కొంది. విమాన ప్రయాణికులకు అందించే సేవల నాణ్యత, నిర్వహణ సామర్థ్యం మెరుగుపడుతున్నాయని వెల్లడించింది. టాటా సన్స్‌తో కలిసి ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మధ్య సమన్వయం పెంచడం, నిర్వహణ ఖర్చులు తగ్గించడం, వ్యాపార వ్యూహాలను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. భారత్‌లో విమానయాన రంగానికి ఉన్న విస్తృత అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, ఎయిర్ ఇండియా దీర్ఘకాలిక వృద్ధిపై ఆశాభావం వ్యక్తం చేసింది.





