పశ్చిమగోదావరి జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు గారి ఆధ్వర్యంలో ఈ రోజు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, పట్టణం మరియు మండలం సభ్యులకు, వైయస్ఆర్ సీపీ ఐడీ కార్డ్ ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి, పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణం రాజు గారు, పార్లమెంట్ ఇంచార్జ్ గూడూరి ఉమాబాల గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.








