Bhadradhi kothagudem, 29.07.2026
కరకగూడెం మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ సూచించారు. చెరువులు, వాగులు, వరద ప్రవాహ ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరించారు.
కరకగూడెం మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కోరారు.
అత్యవసర పరిస్థితులు తప్ప ప్రజలు ఇంటి నుండి బయటకు రావద్దని, చెరువులు, కుంటలు, వాగులు, కాలువలు, వరద ప్రవాహ ప్రాంతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దని సూచించారు.
రైతు సోదరులు తమ పొలాల వద్ద విద్యుత్ తీగలు, నీటి ప్రవాహాలు, ప్రమాదకర ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాగే విద్యార్థులు కూడా వర్షాల సమయంలో బయట సంచరించకుండా తల్లిదండ్రుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా ప్రమాదం జరిగినట్లయితే వెంటనే 9347149313 నంబర్‌కు సమాచారం అందించాలని, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాల కోసం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ తెలిపారు.












