కోహెడ (రాజకీయ ప్రభంజనం) నవంబర్ 21
కరీంనగర్ జిల్లా అలుగునూరులో నిర్వహించనున్న కేసీఆర్ దీక్షా దివస్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకులు, కంటెస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా అలుగునూరులో నిర్వహించనున్న కేసీఆర్ దీక్షా దివస్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకులు, కంటెస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి సాధించిందని ఆయన పేర్కొన్నారు. సాగునీరు, తాగునీరు, వ్యవసాయం, విద్యుత్, విద్య, వైద్య రంగాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయని తెలిపారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబంధు, గురుకుల విద్యాసంస్థల వంటి కార్యక్రమాలు కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనమన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ విమర్శలకే పరిమితమై, రైతులకు సాగునీరు అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాజు విమర్శించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద మోటార్లను వెంటనే ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామగ్రామాన వివరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ బహిరంగ సభ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరోసారి చాటిచెప్పే విధంగా ఉండాలని రాజు పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లాలని ఆయన అన్నారు. సభ విజయవంతానికి ప్రతి నాయకుడు బాధ్యత తీసుకోవాలని, అందరూ కలిసికట్టుగా పనిచేసి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి భారీ జనసమీకరణ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.







