మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురం గ్రామంలో గత వారం పది రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో, ఖాళీ బిందెలతో మహిళలు నిరసన తెలిపారు.
శివలింగాపురం వాసులు త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంపులు రాకపోవడంతో ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఈ పరిస్థితి నెలకొనడంతో, భవిష్యత్తులో నీటి కష్టాలు మరింత తీవ్రమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమస్యపై సంబంధిత అధికారులను సంప్రదించగా, పైప్లైన్ మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని, అయితే మెటీరియల్ సరఫరాలో జాప్యం కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. ఈ నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాగునీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ, స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ యువజన అధ్యక్షులు బోశెట్టి రవిప్రసాద్ కూడా పాల్గొన్నారు.
ప్రజల అవసరాలను గుర్తించి, అధికారులు తక్షణమే స్పందించి, నీటి సరఫరా సమస్యను పరిష్కరించాలని కోరడమైనది. ఈ నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.









