Bhadradhi kothagudem, 2026-11-21
పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఓట్ బచావో దేశ్ బచావో () ఫేజ్ 3 కార్యక్రమం అశ్వారావుపేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల, పట్టణ అధ్యక్షులు, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఓటర్లను చైతన్యపరిచేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.
పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారి ఆదేశాల మేరకు ఓట్ బచావో దేశ్ బచావో () ఫేజ్ 3 కార్యక్రమం పినపాక నియోజకవర్గ మండల, పట్టణ అధ్యక్షులు పాల్గొన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని గండుగుల పల్లి గ్రామంలో, అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా అబ్జర్వర్, ఓట్ బచావో దేశ్ బచావో ప్రోగ్రామ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ వేగి వెంకటేష్, అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి తోట దేవి ప్రసన్న గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో మన అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఓట్ చోరీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా ఫేజ్ 1, ఫేజ్ 2లలో లు విజయవంతంగా పని చేశారని తెలిపారు.
అలాగే ఫేజ్ 3లో కూడా అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, లను ఓట్ రక్షకులుగా నియమించారని, ఓట్ రక్షక్ యాప్లో లాగిన్ అయి, ప్రతి ఒక్క ఓటును పర్యవేక్షించి, ఏ ఒక్క ఓటు కూడా వృథా కాకుండా కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు పీరినాకి నవీన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కురం రవి ముదిరాజ్, పినపాక మండల అధ్యక్షులు పేరం వెంకటేశ్వర్లు, బూర్గంపాడు మండల అధ్యక్షులు పూలపెల్లి సుధాకర్ రెడ్డి, ఆళ్లపల్లి మండల అధ్యక్షులు వాసం శ్రీకాంత్, గుండాల మండల అధ్యక్షులు ఊకె బుచ్చయ్య, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్, మరియు జిల్లా ముఖ్య నాయకులు, మండలాల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.







