జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల డిజిటల్ ప్రసార వేదిక సోనీ లివ్కు భారీ వాణిజ్య విజయాన్ని అందిస్తున్నాయి. ఆసియా క్రీడల ప్రసారం ద్వారా సోనీ లివ్ సాధిస్తున్న ప్రకటన ఆదాయం, గత ఎడిషన్ కంటే ఇప్పటికే అధిగమించినట్లు సంస్థ వెల్లడించింది. పోటీలు ఇంకా కొనసాగుతుండగానే ఈ స్థాయి ఆదాయం నమోదవడం విశేషం.
సోనీ లివ్ తెలిపిన వివరాల ప్రకారం, 2026 ఆసియా క్రీడల ప్రసారానికి ఇప్పటివరకు 18కు పైగా ప్రముఖ బ్రాండ్లు భాగస్వాములుగా చేరాయి. దీంతో బహుళ క్రీడల ప్రసారంలో సోనీ లివ్కు ఇది ఇప్పటివరకు అత్యధిక ప్రకటన ఆదాయాన్ని అందించిన ఈవెంట్‌గా నిలిచింది. వివిధ క్రీడల్లో భారత అథ్లెట్లు పాల్గొంటుండటం, ముఖ్యంగా క్రికెట్‌పై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి డిజిటల్ వీక్షణకు ఊతమిస్తున్నట్లు సంస్థ పేర్కొంది.
18కు పైగా బ్రాండ్ల భాగస్వామ్యం
2026 ఆసియా క్రీడల సోనీ లివ్ ప్రసారానికి జేఎస్‌డబ్ల్యూ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, అమూల్ సహ-ప్రధాన ప్రాయోజకులుగా ఉన్నాయి. విమల్ సహ-ప్రాయోజకుడిగా ఉండగా, అడిడాస్, అల్ట్రాటెక్ సిమెంట్, మ్యూచువల్ ఫండ్స్ సహీ హై, గూగుల్ సెర్చ్, జేకే టైర్స్ భాగస్వామ్య ప్రాయోజకులుగా ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైలైట్స్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
అదే విధంగా రిలయన్స్ ఫౌండేషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాపిల్, ఎయిర్‌బీఎన్‌బీ, రెడ్‌బుల్, స్కైస్కానర్, లావా వంటి సంస్థలు కూడా ఈ క్రీడల ప్రసారంతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. వివిధ క్రీడలకు ప్రత్యేక కార్యక్రమాలు, విశ్లేషణలు, ఆటగాళ్ల ప్రదర్శనలపై ప్రత్యేక విభాగాల ద్వారా బ్రాండ్లకు ప్రేక్షకులతో అనుసంధానం కల్పిస్తున్నట్లు సోనీ లివ్ తెలిపింది.
టీవీతో పాటు డిజిటల్ ప్రసారం
2026 ఆసియా క్రీడల భారత ప్రసార హక్కులను సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా దక్కించుకుంది. క్రీడలను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తుండగా, సోనీ లివ్‌లో డిజిటల్ ప్రసారం చేస్తున్నారు. భారత ప్రేక్షకుల కోసం పలు భాషల్లో కవరేజీని అందిస్తున్నారు.
ఈసారి ఆసియా క్రీడల్లో క్రికెట్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. భారత మహిళల జట్టు స్వర్ణం సాధించగా, పురుషుల క్రికెట్ పోటీలు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. న భారత్శ్రీలంక పురుషుల క్రికెట్ సెమీఫైనల్ సహా పలు కీలక పోటీలను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్, సోనీ లివ్‌లో ప్రసారం చేస్తున్నారు.
బహుళ క్రీడలతో పెరిగిన ప్రేక్షకుల పరిధి
ఆసియా క్రీడలు కేవలం క్రికెట్‌కే పరిమితం కాకుండా ఆర్చరీ, హాకీ, వాలీబాల్, స్క్వాష్, రెజ్లింగ్, జూడో, రగ్బీ, సెపక్ టక్రా వంటి అనేక క్రీడలను కలిగి ఉన్నాయి. దీంతో విభిన్న క్రీడలను అనుసరించే ప్రేక్షకులను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడానికి అవకాశం ఏర్పడింది. సోనీ లివ్ ప్రకారం, ఈ బహుళ క్రీడల స్వభావమే బ్రాండ్లకు విస్తృత ప్రేక్షక వర్గంతో అనుసంధానం కావడానికి అవకాశం కల్పిస్తోంది.


