పినపాక నియోజకవర్గస్థాయి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించింది. ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ వద్ద జరిగిన ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, పట్టభద్రుల ఓటు నమోదు వంటి అంశాలపై చర్చించారు.
జనసేన పార్టీ పినపాక నియోజకవర్గం కోఆర్డినేటర్ కొసనా అంకుబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. గత 12 సంవత్సరాలుగా తెలంగాణలో జనసేన పార్టీని అణగదొక్కే ప్రయత్నాలను కార్యకర్తలు ఐక్యంగా ఎదుర్కోవాలని, పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగం కావాలని అంకుబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పినపాక నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ సాయి, భద్రాచలం నియోజకవర్గం బండి నరేష్ హాజరయ్యారు. పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై కార్యకర్తలకు, మండల నాయకులకు వారు దిశా నిర్దేశం చేశారు.
జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ గడల శ్రీనివాసరావు విజయం కోసం ప్రతి కార్యకర్త పవన్ కళ్యాణ్ వలె కృషి చేయాలని, నియోజకవర్గ ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. తద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయఢంకా మోగించేలా పనిచేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో మండలం నాయకులు పుట్టి శ్రీనివాసరావు, మణుగూరు మండల నాయకులు అమూల్ శ్రీను, ప్రశాంత్, పినపాక మండల నాయకులు కొండేరు సరేష్, బాబు, రాజు, గుండాల మండలం నాయకులు చెన్నా రాంబాబు, మండల నాయకులు అడబాల రాముతో పాటు అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు.









