మానుగూరు, 2026-06-05
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీలో పూనెం సరోజకు కీలక బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఈ నియామకంపై ఉత్తర్వులు జారీ చేశారు. అక్షర మహిళా మండలి అధ్యక్షురాలిగా ఆమె చేస్తున్న సేవలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీలో పూనెం సరోజకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. అక్షర మహిళా మండలి అధ్యక్షురాలిగా, మహిళా సమస్యల పరిష్కారానికి, మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్న పూనెం సరోజకు కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల అక్షర మహిళా మండలి సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
ఆమెకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పార్టీ బలోపేతానికి, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేయడానికి కృషి చేస్తారని వారు ఆకాంక్షించారు. కొన్నేళ్లుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గురిజాల గోపి నేతృత్వంలో పార్టీ బలోపేతానికి, పేదలకు సేవా కార్యక్రమాలలో ముందుంటూ, అక్షర మహిళా మండలి అధ్యక్షురాలిగా ఉన్న పూనెం సరోజ సేవలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించింది.
సేవలను గుర్తించిన అధిష్టానం
మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ఆశీస్సులతో, జిల్లా కాంగ్రెస్ నాయకులు గురిజాల గోపి ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పూనెం సరోజ తెలిపారు.
టీపీసీసీ, డీసీసీ అధ్యక్షులకు కృతజ్ఞతలు
జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా అవకాశం కల్పించిన టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నలకు పూనెం సరోజ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.








