ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులతో హైదరాబాద్లో జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. నేరాల నియంత్రణకు పోలీసు వ్యవస్థలో సంస్కరణలు, సాంకేతికత వినియోగం, పోలీసుల సంక్షేమం అత్యంత కీలకమని ఆయన అన్నారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం ద్వారా సురక్షితమైన ప్రాంతాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు.
ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన గౌరవనీయులైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్లు, దక్షిణాది రాష్ట్రాల సీనియర్ పోలీసు అధికారులు, వివిధ కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు, ప్రతినిధులకు హృదయపూర్వక స్వాగతం. మన హైదరాబాద్ నగరానికి మీ అందరికీ సాదర స్వాగతం. సదస్సు మన రాష్ట్రంలో, మన హైదరాబాద్లో జరుగుతుండటం మనకు గర్వకారణం. ఈ సదస్సు ద్వారా రాష్ట్రాల పోలీసు విభాగాలు, ప్రత్యేక విభాగాల మధ్య మెరుగైన సమన్వయం సాధించేందుకు అవకాశం కలుగుతుంది.
సమాజానికి భద్రత, రక్షణ అనేవి పునాదుల వంటివి. సమర్థవంతంగా, నైతిక విలువలతో, నిష్పక్షపాతంగా పనిచేసే పోలీసు వ్యవస్థను అందించాలని ప్రజలు కోరుకుంటారు. నేరాల స్వరూపం మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వంటి వేదికలు ఎంతో కీలకం. పోలీసింగ్ విధానాలు మారాలి, సంస్కరణలు నిరంతరం కొనసాగాలి.
నేను సంస్కరణలను విశ్వసిస్తాను. పోలీసు వ్యవస్థకు మనం అందించే వనరులు ఖర్చు మాత్రమే కాదు, మెరుగైన సమాజ నిర్మాణానికి, పౌరుల భద్రతకు చేసే పెట్టుబడిగా నేను భావిస్తున్నాను. హైదరాబాద్ పోలీసు వ్యవస్థను హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనే మూడు కమిషనరేట్లుగా విభజించాం. దీంతో ప్రతి పోలీసు కమిషనర్ పరిమిత ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి, మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం కలుగుతుంది.
వివిధ రకాల నేరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించేందుకు , , - వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ట్రాఫిక్ సమస్యలు అత్యంత కీలకంగా మారాయి. ప్రతి విభాగం, ప్రతి ప్రత్యేక విభాగం సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణపై దృష్టి సారించి అత్యుత్తమ ఫలితాలు సాధించాలి.
మనం చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాల నివారణ, నక్సలిజం నిర్మూలన వంటి అన్ని రంగాల్లో తెలంగాణ పోలీసు శాఖ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, ప్రశంసలు పొందుతోంది. గౌరవనీయులైన ప్రధానమంత్రి నిర్వహించిన సమీక్ష సందర్భంగా సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
తెలంగాణను పూర్తిగా నక్సల్స్ రహిత రాష్ట్రంగా మార్చడంలో కృషి చేసిన మన పోలీసు అధికారులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. మాదకద్రవ్యాల నియంత్రణలో విభాగం కేంద్ర ప్రభుత్వం నుంచి 80 శాతానికి పైగా మార్కులు సాధించింది. సైబర్ నేరాల ద్వారా బాధితులు పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఇప్పించే విషయంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది.
అమెరికాలోని తరహాలో ఆహార కల్తీని అరికట్టడం, ఔషధాల నియంత్రణ కోసం వివిధ విభాగాల ప్రయత్నాలను సమన్వయం చేసేందుకు - అనే కొత్త విభాగాన్ని ప్రారంభించాం. మన చెరువులు, సరస్సులు, ఇతర జలవనరులను పరిరక్షించడం, పునరుద్ధరించడం, వాటికి పూర్వ వైభవం తీసుకురావడం ద్వారా ప్రజల మన్ననలు పొందుతోంది. అలాగే ప్రభుత్వ ఆస్తులు, ప్రజా ఆస్తుల రక్షణకు కూడా కృషి చేస్తోంది.











