భారత మాజీ ప్రధానమంత్రి, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. దేశ ఆర్థిక ప్రగతికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
దేశ ఆర్థిక ప్రగతికి దూరదృష్టితో దిశానిర్దేశం చేసిన మహనీయుడని ముఖ్యమంత్రి అన్నారు. ఆర్థిక మంత్రిగా వారు చేపట్టిన సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన మార్పులకు నాంది పలికి, దేశ అభివృద్ధి పయనంలో చారిత్రక మలుపుగా నిలిచాయని తెలిపారు.
ఎన్ని ఉన్నత పదవులు నిర్వహించినా సరళత, నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరత, ప్రజాసేవ పట్ల అంకితభావాన్ని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎన్నడూ వీడలేదని ముఖ్యమంత్రి గారు కొనియాడారు. ఆయన వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శమని పేర్కొన్నారు.
ప్రపంచ ఆర్థిక వేదికపై భారతదేశానికి గౌరవాన్ని తీసుకువచ్చిన దార్శనిక ఆర్థికవేత్తగా డాక్టర్ మన్మోహన్ సింగ్ అందించిన సేవలు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆయన దూరదృష్టి, సంస్కరణలు దేశాన్ని ముందుకు నడిపించాయని అన్నారు.












