మానుగూరు, 1 July
ష,ఉఫ(PRP)చతచజచ.షచ.
అధికారుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆగదని మణుగూరు ఏరియా అధికారుల సంఘం స్పష్టం చేసింది. పే అప్గ్రేడేషన్ను తక్షణమే అమలు చేయాలని, గత రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (PRP)ను వెంటనే విడుదల చేయాలని, అధికారుల న్యాయమైన హక్కులను పరిరక్షించాలని కోరుతూ మణుగూరు ఏరియా అధికారులు చేపట్టిన నిరసన కార్యక్రమం రోజురోజుకూ బలోపేతమవుతోంది. బుధవారం ఈ ఆందోళన మూడో రోజుకు చేరుకుంది.
గత రెండు రోజులుగా పలువురు ఉన్నతాధికారులు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించడం, కొందరు స్వచ్ఛందంగా ఆందోళనలో పాల్గొనేందుకు ముందుకు రావడం అధికారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇది అధికారుల ఐక్యతకు, ఉద్యమంపై ఉన్న అంకితభావానికి నిదర్శనమని సీఎంఓఏఐ మణుగూరు ఏరియా శాఖ పేర్కొంది.
ఆశించిన ఫలితం సాధించే వరకు ఉద్యమాన్ని ఇదే పట్టుదలతో, క్రమశిక్షణతో, శాంతియుతంగా కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. యాజమాన్యం అధికారుల న్యాయమైన డిమాండ్లపై తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకుని సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
మణుగూరు ఏరియా అధికారులందరూ ఇదే ఐక్యతను కొనసాగిస్తూ ఉద్యమంలో చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని సీఎంఓఏఐ మణుగూరు ఏరియా శాఖ పిలుపునిచ్చింది.
ఈ సందర్భంగా మూడో రోజు నిరాహార దీక్షలో శ్రీ గ్రంధి శ్రీనివాస్, శ్రీ ఎం. నర్సింహారావు, శ్రీ మహమ్మద్ ముజాహిద్, శ్రీ పాపారావు, శ్రీ కిరణ్ కుమార్, శ్రీ రామకృష్ణ, శ్రీ సైదులు, శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీమతి నవ్య, కుమారి అంజలి పాల్గొన్నారు. పలువురు అధికారులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేస్తూ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.











