ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్, బెడ్‌సైడ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సిద్దెల తిరుమలరావు తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం మణుగూరు ఏరియా వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. రామకృష్ణకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల మంది కార్మికులు చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2022లో జారీ చేసిన జీవో నంబర్ 60 ప్రకారం రూ.15,600 వేతనం నిర్ణయించగా, పీఎఫ్, ఈఎస్ఐ మినహాయింపుల అనంతరం రూ.12,093 చెల్లించాల్సి ఉందని తెలిపారు. అయితే పలు ఆసుపత్రుల్లో కార్మికులకు రూ.10 వేల నుంచి రూ.11,500 వరకు మాత్రమే చెల్లిస్తున్నారని ఆరోపించారు. దశాబ్దాలుగా సేవలందిస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా కల్పించడం లేదని, పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా అమలు కావడం లేదని పేర్కొన్నారు. ఇప్పటివరకు పలువురికి ఈఎస్ఐ కార్డులు కూడా అందలేదని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించినా స్పందన లేదని తెలిపారు. గతంలో డీఎంఈ కార్యాలయం వద్ద ఆందోళనలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో సమ్మెకు సిద్ధమైనట్లు వెల్లడించారు. రాష్ట్రస్థాయిలో సమ్మె నోటీసు అందజేశామని, అందులో భాగంగా జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, కలెక్టర్లు, డీసీహెచ్ఎస్ అధికారులకు నోటీసులు అందజేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో చెన్నం వీరస్వామి, కొండేటి స్వాతి, నాగలక్ష్మి, అనూష, ఝాన్సీ, భద్రమ్మ, రాణి, మణి, ప్రమీల, విజయలక్ష్మి, రమణ, సుశీల, మంగ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
డిసెంబర్ 7 నుంచి సమ్మె సైరన్
Share:

సారాంశం
మణుగూరు ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు వినతిపత్రం
ముఖ్య విషయాలు
- రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల మంది కార్మికులు చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
- 2022లో జారీ చేసిన జీవో నంబర్ 60 ప్రకారం రూ.15,600 వేతనం నిర్ణయించగా, పీఎఫ్, ఈఎస్ఐ మినహాయింపుల అనంతరం రూ.12,093 చెల్లించాల్సి ఉందని తెలిపారు.
- అయితే పలు ఆసుపత్రుల్లో కార్మికులకు రూ.10 వేల నుంచి రూ.11,500 వరకు మాత్రమే చెల్లిస్తున్నారని ఆరోపించారు.
- ఇందులో భాగంగా సోమవారం మణుగూరు ఏరియా వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Prem Kumar
Reporter
Telangana
330ఆర్టికల్స్
1,19,071వ్యూస్





