అశ్వాపురం, 16 July
బఆఎభహయలోల,షలయలగలచయషలఖఎ.చ.గూషలోే-ైచేఆయఆోచ.
సీతారామ ప్రాజెక్టు పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, కమిషన్ల రాజకీయాలకు నిదర్శనమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రాజీవ్ సాగర్ ప్రాజెక్టును కమిషన్ల కోసమే రీ-డిజైన్ చేశారని ఆయన ఆరోపించారు.
సీతారామ ప్రాజెక్టుపై నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంలో పారదర్శకత పాటించలేదని, ప్రజాధనం వృథా అయ్యేలా వ్యవహరించిందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు.
అలాగే, సీతారామ ప్రాజెక్టును పూర్తి సామర్థ్యంతో అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పనితీరుపై ప్రజలకు పూర్తి వాస్తవాలు తెలియజేయడానికే ఈ ప్రెస్మీట్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.









