గజ్వేల్, జూలై 13
సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి గజ్వేల్‌లోని 15వ వార్డులో పర్యటించి, ఓటు నమోదు కార్యక్రమాన్ని సందర్శించారు. ఓటు హక్కును కాపాడుకోవాలని, ప్రత్యేక ఓటు సవరణ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలను ఆమె అభినందించారు.
సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి సోమవారం 15వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ఓటరు నమోదు హెల్ప్ డెస్క్‌ను సందర్శించి, ఓటును భద్రపరచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. అందరూ ప్రత్యేక ఓటు సవరణ కార్యక్రమంలో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని అవగాహన కల్పించారు.
బిఎల్ఓలకు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. స్వచ్ఛందంగా సహకరించిన సామాజిక కార్యకర్త సాధాక్ పాషా, బిఎల్ఓ బసడి మమత, నాయకులు కృపనందం, కనకస్వామిలను శాలువాతో సత్కరించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కౌన్సిలర్లు నక్క సంతోషి రాములు గౌడ్, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, టిపిసిసి కార్యదర్శి నాయిని యాదగిరి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండల్ రెడ్డి, సీనియర్ నాయకులు వహీద్ ఖాన్, జోగిని లక్ష్మణ్, మహంకాళి చంద్రం, కృపనందం, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.








