భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరులో ఒక పార్టీ మండల అధ్యక్షుడు తీరుపై అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఆయనపై తిరుగుబాటు చేసే నాయకుల సంఖ్య పెరుగుతోందని, పార్టీ పెద్దలు కూడా ఆయన వైఖరిపై అసహనంతో ఉన్నారని సమాచారం.
మణుగూరులో ఒక పార్టీ మండల అధ్యక్షుడుపై అసంతృప్తి రోజురోజుకు పెరుగుతోంది. పార్టీ పదవులను అడ్డుపెట్టుకుని ఆయన చేస్తున్న కొన్ని కార్యకలాపాలు బయటపడటంతో పాటు, పలు సంఘాలు ఆయన పోకడలను వ్యతిరేకిస్తున్నాయని తెలుస్తోంది. దీనితో పాటు, స్థానిక ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన తీరు పార్టీ పెద్దల దృష్టికి వచ్చినట్లు సమాచారం.
పార్టీలోని సీనియర్ నాయకులు, కార్యకర్తలు కూడా ప్రస్తుత అధ్యక్షుడి తీరుపై అసహనంతో ఉన్నారని, ఆయన ఆగడాలు ఎక్కువవుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. కొందరు నాయకులు, ప్రముఖులు బహిరంగంగానే ఆయన పోకడలను చర్చిస్తూ, ఇది పార్టీకి చెడ్డపేరు తెస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమన్వయంతో అందరినీ కలుపుకుని పోవాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా ఆయన ప్రవర్తించే తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో, పార్టీకి చెడ్డపేరు తెస్తున్న ప్రస్తుత అధ్యక్షుడిని తొలగించి, పార్టీకి సేవ చేసే మరో సీనియర్ నాయకుడిని రంగంలోకి దించాలని కొందరు నాయకులు రహస్యంగా చర్చించుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుత అధ్యక్షుడు కొనసాగితే పార్టీకి నష్టం తప్పదని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన మళ్లీ పదవిలో కొనసాగుతారా లేక పార్టీకి మంచి పేరు తెచ్చే మరో నాయకుడిని ఎంపిక చేస్తారా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
ఈ పరిణామాలపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన ఈ విషయంపై తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.








