కొత్తగూడెం, 2026-11-23
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్, బెడ్ సైడ్ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నట్లు మెడికల్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్‌కు అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసును అందజేశారు. అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కుర్రి సైదయ్య, ప్రధాన కార్యదర్శి చిన్న బొస్కా నరేష్, ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్, కోశాధికారి పత్తిపాటి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి ఉబ్బ రమ్మక్క గార్ల ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న సుమారు 20,000 మంది కార్మికులు చాలీచాలని జీతాలతో ఎన్నో ఇబ్బందులు పడుతూ, ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలియపరిచారు. 2022లో జీవో నంబర్ 60 ప్రకారం రూ. 15,600/- వేతనం ఉండాలని, కటింగ్ మినహాయించి రూ. 12,093/- ఇవ్వాలని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఆరోగ్య ఉన్నత అధికారులు జీవో విడుదల చేశారు. అయితే, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో కార్మికులకు అన్యాయం చేస్తూ రూ. 10,000/-, రూ. 10,500/-, రూ. 11,000/-, రూ. 11,500/- మాత్రమే ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కనీసం రెండు మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న కార్మికులకు సరైన గుర్తింపు లేదని, ప్రమాద బీమా సౌకర్యం లేదని, నిబంధనల ప్రకారం సక్రమంగా చెల్లించడం లేదని, ఇప్పటివరకు ఏ కార్మికులకు కూడా కార్డులు ఇవ్వలేదని వారు మండిపడ్డారు. ఈ సమస్యలపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహం, వైద్య విభాగం అధికారులు . నరేందర్, . వాణి మేడం, వైద్య విభాగం ప్రిన్సిపాల్ సెక్రెటరీ క్రిస్టినీయా మేడం గార్లను అనేకమార్లు కలిసి వినతిపత్రాలు అందించినప్పటికీ ఫలితం లేదని తెలిపారు. గతంలో పలుమార్లు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని కార్యాలయాన్ని ముట్టడించిన సంఘటనలు జరిగినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల నుండి మొదలుకొని , ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో పనిచేస్తున్న కార్మికులు వ తేదీ నుండి సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా, అన్ని జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు, జిల్లా కలెక్టర్లకు, లకు ఆయా జిల్లాల కమిటీల ద్వారా సమ్మె నోటీసు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్‌కు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసును అందజేశారు. ఈ కార్యక్రమంలో చెన్నం వీరస్వామి, అలవాల వెంకట్రావు, ఉబ్బ వేణు పాల్గొన్నారు.







